హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వాహనాల నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసు'

WNP: జిల్లాలో నకిలీ, ట్యాంపరింగ్‌ చేసిన నంబర్‌ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వం అనుమతించిన HSRP నంబర్ ప్లేట్లనే వినియోగించాలని ట్రాఫిక్ ఎస్సై సురేందర్ సూచించారు. నంబర్లు కనిపించకుండా చేయడం, ప్లేట్ మార్చడం, స్టిక్కర్లు లేదా అనధికారిక ప్లేట్లు వినియోగిస్తే క్రిమినల్ కేసులతో పాటు వాహనం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.