WGL: గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలి చెందిన రైతు అల్లం సుమన్‌కు చెందిన రెండు పాడి గేదెలు ఆదివారం తెగిపడిన విద్యుత్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాయి. ఈ ఘటనలో ఒక గేదె మృతి చెందగా, మరో గేదె తీవ్రంగా గాయపడింది. బీజేపీ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ బాధిత రైతును పరామర్శించి, ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
విద్యుత్ తీగ తెగిపడి గేదె మృతి


