KMR: ప్రభుత్వం అందించే ఏడు రకాల చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేదీ అని భిక్కనూర్ ఎంపీడీవో సవిత రెడ్డి తెలిపారు. ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులు, బోదకాలు బాధితులు తదితర అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి ఇవాళ ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలని కోరారు.
తెలంగాణ
పింఛన్ల దరఖాస్తుకు నేడే చివరి అవకాశం: MPDO


