హైదరాబాద్: 28°C
వార్తలు

బొత్సపై కేఏ పాల్ ఫైర్

TG: బొత్స సత్యనారాయణ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విజయనగరం సభలో బొత్స తనను గెలిపించాలని కోరారని పాల్ పేర్కొన్నారు. ప్రజల సొమ్మును దోచుకున్నారంటూ బొత్సపై ఆరోపణలు చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు బొత్స వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజలు ఇలాంటి నాయకులకు ఓటు వేయొద్దని పాల్ పిలుపునిచ్చారు.