హైదరాబాద్: 28°C
వార్తలు

లక్నోలో లాయర్ల ఛాంబర్ల కూల్చివేత

యూపీ రాజధాని లక్నోలో కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కోర్టు చుట్టూ అక్రమంగా నిర్మించిన లాయర్ల ఛాంబర్లను మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు 72 అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. సుప్రీంకోర్టులోనూ లాయర్లకు ఉపశమనం లభించకపోవడంతో కూల్చివేతలు కొనసాగాయి. ఈ కూల్చివేతలను లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.