హైదరాబాద్: 28°C
వార్తలు

NIFT స్నాతకోత్సవానికి హాజరుకానున్న రాష్ట్రపతి

రేపు ఢిల్లీలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) సంయుక్త స్నాతకోత్సవం ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 క్యాంపస్‌ల విద్యార్థులు, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉత్తమ ప్రతిభావంతులకు రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నారు.