హైదరాబాద్: 28°C
వార్తలు

చెస్ పోటీల్లో గుంతకల్లు విద్యార్థి ప్రతిభ

ATP: కర్ణాటకలోని మాన్విలో ఆదివారం జరిగిన జాతీయస్థాయి అండర్-18 రాపిడ్ చెస్ పోటీలలో గుంతకల్లుకు చెందిన విద్యార్థి భూమిరెడ్డి పునీత్ రెడ్డి ప్రథమ స్థానం సాధించారు. మొత్తం 6 రౌండ్లకు గాను 5 రౌండ్లలో విజయం సాధించి ఈ ఘనత సాధించారు. ఇప్పటి వరకు పలు పోటీలలో పాల్గొన్న పునీత్ రెడ్డి 34 ట్రోఫీలు, 54 మెడల్స్ సాధించారు. విజేతను పలువురు అభినందించారు.