హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీయులకు ఉజ్బెకిస్థాన్ గుడ్‌న్యూస్

ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన సందర్భంగా ఆ దేశం భారతీయులకు శుభవార్త చెప్పింది. భారత పౌరులకు 30 రోజుల పాటు వీసా లేకుండానే దేశంలోకి ప్రవేశించే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో పర్యాటక, వ్యాపార సంబంధాలు మరింత బలపడతాయని అధ్యక్షుడు మిర్జియోయెవ్ తెలిపారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం వారానికి 14 విమాన సర్వీసులు నడుస్తున్నాయని, వీసా రహిత విధానంతో రాకపోకలు మరింత పెరుగుతాయని చెప్పారు.