MDK: రేగోడ్ మండలంలోని కాకంచతండా పరిధిలోని పచ్చని పొలాల్లో ఆదివారం ఓ నెమలి పురివిప్పి సంతోషంతో నాట్యం చేస్తూ అలరించింది. రంగురంగుల ఈకలతో మయూరం చేసిన నాట్య సోయగాలు ప్రకృతి ప్రేమికులను, స్థానికులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ అరుదైన సుందర దృశ్యాన్ని సోషల్ టీచర్ రవి తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేయగా, పలువురు ఆసక్తిగా వీక్షించారు.
వార్తలు
VIDEO: కనువిందు చేసిన నెమలి నాట్యం


