హైదరాబాద్: 28°C
వార్తలు

హనుమాన్ పాదాలను తాకిన గంగమ్మ!

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎగువ వర్షాలతో గంగా, యమున నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర సంగమం వద్ద ప్రవాహం పెరిగి, ప్రసిద్ధ లేటే శ్రీరామ హనుమాన్ ఆలయంలోకి గంగా నీరు చేరింది. ఆంజనేయుడి పాదాలను గంగమ్మ తాకడంతో భక్తులు విశేష పూజలు, భజనలు చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.