హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక పురస్కారం

ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ దేశ అత్యున్నత పురస్కారం లభించింది. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు మిర్జియోయెవ్ మోదీకి ప్రతిష్టాత్మకమైన 'ఆర్డర్ ఆఫ్ ఒలియ్ దరాజలి దోస్లిక్' అవార్డును అందజేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.