హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రియుడితో దొరికిన భార్య.. గొంతు నులిమి భర్త హత్య

UP సోన్‌భద్రలో దారుణం జరిగింది. ప్రియాంక అనే మహిళ ప్రియుడితో అభ్యంతరకర రీతిలో తన భర్తకు దొరికింది. ఈ క్రమంలో భర్త నిలదీయడంతో ప్రియుడు వికాస్‌తో కలిసి భర్త రామశంకర్ మిశ్రను ప్రియాంక గొంతు నులిమి హత్య చేసింది. ఘటనను రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు భార్య, ప్రియుడు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.