హైదరాబాద్: 28°C
వార్తలు

తాష్కెంట్‌లో మోదీకి ఘన స్వాగతం

ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లో ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ తదితర రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరువురు నేతలు ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. అంతకుముందు మోదీ.. ప్రవాస భారతీయులతో ముచ్చటించిన అపురూప విశేషాలను ఆయన 'X'లో పంచుకున్నారు.