హైదరాబాద్: 28°C
వార్తలు

FDA కమిషనర్‌ ముండేపై హైకోర్టు ఆగ్రహం

మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండేపై బాంబే హైకోర్టు తీవ్రంగా మండిపడింది. 'మీకు మీరే దేవుడిలా భావిస్తున్నారా? సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న విషయాలకే లైసెన్స్‌ల రద్దు, సెలవు రోజుల్లో విచారణకు పిలవడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. వాస్తవాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు చురకలంటించింది.