హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు మార్కాపురం జిల్లాకు సీఎం చంద్రబాబు

AP: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం CM చంద్రబాబు రేపు మార్కాపురం జిల్లాకు రానున్నారు. తొలుత గంటవానిపల్లికి CM చేరుకొని కృష్ణా నీటికి జలహారతి ఇచ్చి వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించి, పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం వెలిగొండ గేట్ల ద్వారా కృష్ణా జలాలను విడుదల చేస్తారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తి నల్లమల సాగరుకు 10.7 TMCల నీటిని CM విడుదల చేస్తారు.