హైదరాబాద్: 28°C
వార్తలు

‘108 దేశాల యువతులను ఏకం చేస్తున్న భారత్’

మహిళల కలలు అంతరిక్షాన్ని తాకుతున్నాయని 'మన్ కీ బాత్' కార్యక్రమంలో PM మోదీ ప్రశంసించారు. 'మిషన్ శక్తిశాట్' ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది విద్యార్థినులను భారత్ ఏకం చేస్తుండటం గర్వకారణమన్నారు. ఈ అద్భుతమైన చొరవ 108 దేశాలకు చెందిన 12 వేల మంది యువతులకు శాటిలైట్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించడానికి, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయడానికి అవకాశం కల్పిస్తుందని తెలిపారు.