హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.183 కోట్ల భారీ GST స్కామ్!

TG: GST ఖాతాను హ్యాక్ చేసి రూ.183 కోట్లకుపైగా నకిలీ లావాదేవీలు సృష్టించిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. హయత్‌నగర్‌లోని ఓ వ్యాపార సంస్థ జీఎస్టీ ఖాతాను హ్యాక్ చేసిన నిందితులు.. 730 నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఈ-వే బిల్లులు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి.. నిందితుల కోసం దర్యాప్తు ముమ్మరం చేసింది.