హైదరాబాద్: 28°C
వార్తలు

హిమాలయాల్లో 188 సరస్సుల విస్పోటనం?

భారత హిమాలయ ప్రాంతంలో పలు హిమానీనద సరస్సులు విస్ఫోటనం చెంది వరదలు సంభవించే ముప్పు పొంచి ఉంది. ఇలాంటి అత్యంత కీలకమైన 188 సరస్సుల వద్ద ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఇటీవల సంభవించిన భారీ వరద విపత్తులో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలను వేగవంతం చేశారు.