రాబోయే 2-3 ఏళ్లలో వ్యాపారాల్లో వాయిస్ ఏఐ కీలక ఇంటర్‌ఫేస్‌గా మారుతుందని జ్ఞాని AI సీఈఓ గణేశ్ గోపాలన్ తెలిపారు. ఇంగ్లిష్‌తో పోలిస్తే తెలుగు వంటి భాషల్లో ఏఐకి శిక్షణ ఇచ్చే నాణ్యమైన డేటా తక్కువగా ఉందన్నారు. తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల మాండలిక వైవిధ్యం, ఇంగ్లీష్ కలిపి మాట్లాడటం వల్ల ఏఐ మోడళ్ల అభివృద్ధిలో సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
వార్తలు
‘రాబోయే రోజుల్లో వాయిస్ ఏఐదే కీలక పాత్ర’


