హైదరాబాద్: 28°C
వార్తలు

‘AIతో ఉద్యోగాలు పోవు, తీరు మారుతుంది’

కృత్రిమ మేధ(AI) వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయం అక్కర్లేదని జ్ఞాని AI సీఈఓ గణేశ్‌ గోపాలన్‌ స్పష్టం చేశారు. AI అనేది మన ప్రత్యర్థి కాదని, మన సామర్థ్యాన్ని పెంచే సహాయకారిగా చూడాలని ఆయన పేర్కొన్నారు. AI వల్ల కస్టమర్ సర్వీస్, ఐటీ రంగాల్లో పనుల తీరు మారుతుందే తప్ప ఉద్యోగాలు మాయం కావని, మనుషులు సంక్లిష్ట సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టొచ్చని తెలిపారు.