హైదరాబాద్: 28°C
వార్తలు

దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష ప్రారంభం

దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది. నీట్ పీజీ పరీక్షకు 2,73,183 మంది దరఖాస్తు చేసుకోగా.. దేశవ్యాప్తంగా 1,300 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణలో నీట్ పీజీ పరీక్షకు 17,627 మంది దరఖాస్తు చేసుకోగా, 56 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.