హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మధ్యప్రదేశ్ సత్నాలో వరద బీభత్సం

మధ్యప్రదేశ్ సత్నాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ఉద్ధృతి పెరిగి.. రైల్వే ట్రాక్‌లపై నీరు చేరింది. ట్రాక్ పైనుంచి వరద పొంగిపొర్లుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 28 ప్యాసింజర్, 20 గూడ్స్ రైళ్ల రాకపోకలను నిలిపేశారు. దీంతో ముంబై, పట్నా, అసోం మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా సర్వీసులు గంటల తలబడి నిలిచాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.