హైదరాబాద్: 28°C
వార్తలు

కేరళ, లక్షద్వీప్‌లో నేడు ఉపరాష్ట్రపతి పర్యటన

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ కేరళ, లక్షద్వీప్‌లో పర్యటించనున్నారు. కేరళ పర్యటనలో భాగంగా ఆయన ప్రతిష్టాత్మక కౌముది వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం ప్రసిద్ధ ఆరన్ముల ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేరళ పర్యటన ముగిసిన తర్వాత ఆయన లక్షద్వీప్‌కు బయలుదేరి వెళ్తారు. అక్కడ మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరుకానున్నారు.