హైదరాబాద్: 28°C
వార్తలు

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

TG: హైదరాబాద్‌లో ఇవాళ జరగనున్న నీట్ పీజీ పరీక్ష నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నగరంలోని 4 పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ మేరకు పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ నిఘా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.