AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంలో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వార్తలు
ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు


