హైదరాబాద్: 28°C
వార్తలు

అర్వింద్‌పై బీజేపీ నేతల అసంతృప్తి

TG: జగిత్యాల జిల్లాలోని బీజేపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహారంపై స్థానిక బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ అంశంపై సమావేశమైన నేతలు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని తీర్మానించారు. జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోగ శ్రావణిని అర్వింద్ వెనకేసుకురావడమే విభేదాలకు కారణమని తెలుస్తోంది. దీనిపై అర్వింద్ స్పందించాల్సి ఉంది.