హైదరాబాద్: 28°C
వార్తలు

బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. WHO వార్నింగ్

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆందోళన వ్యక్తం చేసింది. జంతువుల నుంచి మానవులకు బర్డ్‌ఫ్లూ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆసియా-పసిఫిక్ దేశాలకు సూచించింది. ప్రస్తుతం ఇండియాలో స్వైన్‌ఫ్లూ వ్యాపిస్తోంది. ఈ సమయంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై WHO ఇచ్చిన వార్నింగ్ ప్రజల్లో మరింత ఆందోళనకు కారణమైంది.