JGL: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతి గ్రామంలో ప్రజలను చైతన్య పరచాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాబోయే నిరసనలకై జగిత్యాల పార్టీ కార్యాలయంలో శనివారం ధర్మపురి నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ, స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ఈ భేటీలో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ సమరభేరి: కొప్పుల


