హైదరాబాద్: 28°C
వార్తలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం

PPM: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటరు జాబితాలో చోటు కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదు (ఓటర్ రివిజన్) కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు.