'శుద్ధీకరణ' సమాజంలో ఇంకా ఉన్న అంటరానితనానికి మరో పేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరాఖండ్ హల్ద్వానీలోని రాంలీలా మైదానంలో ఈనెల 8న కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. దీనిలో AICC చీఫ్ ఖర్గే పాల్గొన్నారు. ఈ ర్యాలీ ముగిశాక 'శ్రీరామ్ సేన' గంగాజలం చల్లి ఆ మైదానాన్ని శుద్ధి చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్.. శుద్ధీకరణ చేసినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ఉత్తరాఖండ్‌లో శుద్ధీకరణ ఘటనపై రాహుల్ ఆగ్రహం


