హైదరాబాద్: 28°C
వార్తలు

బోనుకు చిక్కిన టీ-61 ఆడపులి

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి అటవీ విభాగం పరిధిలోని నాగభీడ్ అటవీ ప్రాంతంలో T-61 ఆడపులిని అటవీశాఖ అధికారులు బోనులో బంధించారు. 10 రోజుల ఆపరేషన్‌కు తెర పడింది. మత్తు ఇంజక్షన్‌తో పులిని బంధించినట్లు అధికారులు తెలిపారు. ఈ పులి నాగభీడ్ పరిధిలోని వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి ప్రాణాలు తీసింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.