TG: ఓటు హక్కు అత్యంత కీలకమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిరిసిల్లలో అర్హత ఉన్న ప్రతి ఓటును కాపాడుకోవాలని ఓటర్లకు సూచించారు. ఓటర్లంతా అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల సవరణ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని కోరారు. ఈసీ తీరుపై పలు విమర్శలు ఉన్నాయని తెలిపారు. ఓటర్ల వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ఓటు హక్కు అత్యంత కీలకం: పొన్నం


