హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.51.75 కోట్లను ఫ్రీజ్ చేసిన ఈడీ

రూ.34,615 కోట్ల DHFL లోన్ కుంభకోణంలో భాగంగా UAEకి చెందిన 'అల్ జలోర్ ట్రేడింగ్' సంస్థ ఖాతాలో ఉన్న రూ.51.75 కోట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. కపిల్ వాధ్వావన్ భార్యకు చెందిన యూకే ఆస్తి విక్రయ సొమ్మును ఆమెకు చేరకుండా ఈ సంస్థ ఖాతాకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. బ్యాంకు కన్సార్టియంను మోసం చేసి నిధులను దారి మళ్లించిన ఈ కుంభకోణంపై విచారణ కొనసాగుతోంది.