హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

ప్రధాని మోదీ ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు తాష్కెంట్‌లో ద్వైపాక్షిక పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా భారత్‌-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. 31వ తేదీ, వచ్చే నెల 1న కిర్గిజ్ రిపబ్లిక్‌లో పర్యటిస్తారు.