ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ ఎయిర్‌పోర్టులో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బిలాస్‌పూర్ వచ్చిన ఆ విమానం ల్యాండ్ అయ్యే సమయంలో హఠాత్తుగా టైరు పేలింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ చాకచక్యంతో వ్యవహరించడంతో విమానంలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో సమయంలో విమానంలో 37 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.
వార్తలు
విమానం ల్యాండింగ్ సమయంలో పేలిన టైర్


