హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ ఠాక్రే తీవ్ర హెచ్చరికలు

మరాఠీ భాషా నిబంధనపై ఒత్తిడి పెంచుతూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత అమిత్ ఠాక్రే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హిందీ మాత్రమే మాట్లాడాలని పట్టుబట్టే ఆటో, ట్యాక్సీ డైవర్లను కొడతామని వార్నింగ్ ఇచ్చారు. మరాఠీ భాష నేర్చుకోవడానికి ఏడాది సమయం ఇవ్వడంపై మండిపడ్డారు. యూపీ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ ప్రయోజనాల కోసమే ఇతరులకు సమయం ఇచ్చినట్లు ఆరోపించారు.