AP: సీఎం చంద్రబాబు ఇవాళ అరకులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి సమీక్షించారు. అనంతరం సీఎం కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్న హెలిప్యాడ్, మైదానాన్ని తనిఖీ చేశారు. ప్రజా సౌకర్యాలు, భద్రత, పార్కింగ్ తాగునీటి ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. పర్యటన సజావుగా సాగేందుకు ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు.
వార్తలు
నేడు అరకులో సీఎం పర్యటన


