AP: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే నెల 2 వరకు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దీంతో మూడు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది.
వార్తలు
మూడు రోజులు వర్షాలు


