హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి జుయెల్‌ ఓరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించేందుకు బీజేపీలోని కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన కొందరు నేతలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, తన స్థాయిని దిగజార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసం డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నారని చెప్పారు.