హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

ASR: అరకు మండలం గెన్నెల పంచాయతీ ఆర్‌కే నగర్‌లో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ నిశాంతి శుక్రవారం పరిశీలించారు. హెలిప్యాడ్, ప్రజావేదిక, ఎగ్జిబిషన్ స్టాల్స్‌ పరిశీలించి భద్రత, ట్రాఫిక్, ప్రజల సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. అనంతరం గ్రామంలో తాగునీరు, రహదారులు, విద్యుత్ సమస్యలు తెలుసుకున్నారు.