హైదరాబాద్: 28°C
వార్తలు

తెలంగాణలో పెరిగిన ట్రాఫిక్ నేరాలు

HYD: తెలంగాణలో ట్రాఫిక్ నేరాలు మూడేళ్లలో 9.48 శాతం పెరిగాయి. 2023-24లో 29,130గా ఉన్న కేసులు 2025-26లో 31,891కు చేరాయి. సైబరాబాద్‌లో 2,882 నుంచి 3,677కు, మల్కాజిగిరిలో 3,213 నుంచి 3,673కు పెరిగాయి. హైదరాబాద్‌లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం అర్ధవార్షిక నేర సమీక్ష నిర్వహించి ట్రాఫిక్ నేరాల నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు.