హైదరాబాద్: 28°C
వార్తలు

నాలుగు టూరిజం ప్రాజెక్టులకు లీజు వేలం

KRNL: జిల్లాలోని జగన్నాథగట్టు, కేతవరం, బ్రహ్మగుండం, ఊరుకుంట ప్రాంతాల్లోని ఏపీ టూరిజం వసతులను పదేళ్లకు లీజుకు ఇచ్చేందుకు సెప్టెంబర్ 5న ఓపెన్ ఆక్షన్ నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనే వారు రూ.10 వేల ఈఎండీ చెల్లించాలి. లీజు మొత్తాన్ని ఏటా 5 శాతం పెంచనున్నారు. వివరాలకు కర్నూలు కలెక్టరేట్లోని టూరిజం కార్యాలయాన్ని సంప్రదించాలి.