హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మొక్కలు నాటిన విద్యార్థులు

VSP: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పిలుపుతో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరవ ఓ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం మొక్కలు నాటారు. జీవీఎంసీ సమకూర్చిన మహాగని, కదంబం, నేరేడు, టబోబియా, గంగరావి తదితర మొక్కలను విద్యార్థులు నాటారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.శ్రీధర్ పట్నాయక్ పచ్చదనం పెంపొందించాలని సూచించారు.