హైదరాబాద్: 28°C
వార్తలు

నిఖిత హత్య కేసులో మాజీ ప్రియుడు అరెస్ట్

TG: అమెరికాలో నిఖిత హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిఖిత హత్యకు సంబంధించి నిందితుడు, ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (27)ను తెలంగాణ పోలీసులు ఆగ్రాలో అరెస్టు చేశారు. 2025 డిసెంబర్ 31న మేరీల్యాండ్‌లో హత్య అనంతరం భారత్‌కు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా అభ్యర్థన మేరకు నిందితుడిని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అప్పగింత ప్రక్రియ ప్రారంభమైంది.