హైదరాబాద్: 28°C
వార్తలు

ఏడాది గడువు.. ఆటో డ్రైవర్ల సంబరాలు

మరాఠీ భాష నేర్చుకోవడానికి నాన్-మరాఠీ ఆటో డ్రైవర్లకు మరో ఏడాది పాటు గడువు పొడిగిస్తూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయం పట్ల డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలో ఆటో డ్రైవర్లు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ వెసులుబాటు తమకు ఎంతో ఉపశమనం కలిగించిందని, సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.