హైదరాబాద్: 28°C
వార్తలు

పీఎం జన్ ధన్ యోజనకు 12 ఏళ్లు పూర్తి

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన(PMJDY) పథకం ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాని అపూర్వ విజయాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా హైలైట్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలను ఆర్థికంగా శక్తివంతం చేయడంలో, ఆర్థిక సమ్మిళితాన్ని సాధించడంలో ఈ పథకం ఎంతో అసాధారణ ప్రభావాన్ని చూపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 'X' వేదికగా జన్ ధన్ సేవలను కొనియాడుతూ ప్రధాని పోస్ట్ చేశారు.