హైదరాబాద్: 28°C
వార్తలు

'ఉద్యోగుల సమస్యలపై సీరియస్‌గా చర్చించాలి'

AP JAC అమరావతి రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. దీనిలో ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్‌పై చర్చించారు. జిల్లా నాయకత్వాల అభిప్రాయాలతోనే నిర్ణయాలు తీసుకుంటామని AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగుల తరఫున ఏకపక్ష నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. 13 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్ తమపై ఆధారపడి ఉందని.. వారి సమస్యపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.