హైదరాబాద్: 28°C
వార్తలు

'వెలిగొండ నిర్వాసితులకు రూ.740 కోట్లు చెల్లించాం'

AP: YCP ప్రభుత్వం వెలిగొండ నిర్వాసితులను దారుణంగా మోసం చేసిందని.. వారికి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదన్నారు మంత్రి రామానాయుడు. కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు 40 రోజుల్లోనే రూ.740 కోట్లు చెల్లించిందన్నారు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు మేరకు నిర్వాసితులకు అదనంగా రూ.169 కోట్లు ఇచ్చేందుకు CM అంగీకరించారన్నారు. నిర్వాసితులకు నెల రోజుల పాటు ఉచితంగా నిత్యావసరాలు అందజేస్తామన్నారు.