హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి ఇంటికి రూ.5 లక్షలు ఇచ్చాం: పొంగులేటి

TG: ప్రభుత్వం తరపున ప్రతి ఇంటికి రూ.5 లక్షలు ఇచ్చామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ ఇళ్లు ఇచ్చామన్న ఆయన, మరో 10 రోజుల్లో రెండో విడత జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. 16 నియోజకవర్గాల్లో స్థల సేకరించి ముగించామని, రెండు, మూడ్రోజుల్లో టవర్ల నిర్మాణం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 10 ఏళ్ల తర్వాత ఇంటిని అమ్ముకునే హక్కు కల్పిస్తామన్నారు.