హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని అభ్యర్థిగా తమిళనాడు సీఎం విజయ్!

ఇండియా టుడే - సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రధాన మంత్రి అభ్యర్థులుగా మోదీ, రాహుల్ గాంధీ తర్వాత TVK అధినేత విజయ్ మూడో స్థానంలో నిలిచారు. 48.7 శాతం మంది మోదీకి మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీ రెండో స్థానంలో 27.1 శాతం, మూడో స్థానంలో 9.2 శాతం మద్దతుతో తమిళనాడు సీఎం విజయ్ ఉండటం గమనార్హం. ప్రధాని అభ్యర్థుల జాబితాలో అనూహ్యంగా విజయ్ పేరు కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.